Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అజా' డిజైనరీ స్టోర్ అందరి అడ్డా అని మిల్కీ బ్యూటీ తమన్నా అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్డు నెం.11లో నూతనంగా ఏర్పాటు చేసిన 'అజా' డిజైనర్ స్టోర్‌ను మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రారంభించా రు. ప్రముఖ డిజైనర్ దేవాంగి ఫరేఖ్ ఏర్పాటు చేసిన ఈ డిజైనరీ బొటిక్‌లో డిజైనరీ వస్త్రాలు,ఆభరణాలు, హస్తకళల ఉత్పత్తులు అన్నీ ఒకే వేదికపై లభ్యమవుతాయని తెలిపారు. దేశంలోని ఢిల్లీ, ముంబై నగరాల్లో ఇప్పటికే తమ స్టోర్లు ఉన్నాయనీ, నగరంలో తొలిసారిగా ఇక్కడ ప్రారంభించినట్టు నిర్వాహకులు చైర్పర్సన్ అల్కా నిషార్ తెలిపారు. నగర వాసులకు సరికొత్త షాపింగ్ ఎక్స్‌పీరి యన్స్ అందించేందుకు అజా కృషి చేస్తుందని తెలిపారు. ఆన్లైన్ మార్కెట్స్‌లో కూడా తాము అత్యున్నత స్థానంలో ఉన్నామనీ, అందుకే ఇక్కడ ఆఫ్‌లైన్ స్టోర్‌ను కూడా ప్రారంభించామని తెలిపారు.