Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ డివిజన్లో దిల్ కుష్ నగర్ లో పీసీసీ సభ్యులు సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో శుక్రవారం హాథ్ సే హాథ్ జోడో యాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ రాహుల్ గాంధీ సందేశాన్ని కర పత్రాల ద్వారా అందజేశారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ గడప గడపకీ వెళ్లి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అక్రమాలను, ఇచ్చిన హామీలను అన్ని వర్గాల ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాము చేపట్టే పనుల గూర్చి వివరించారు. కాంగ్రెస్ ప్రజల గుండెల్లో ఉందనీ, వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. దిల్ కుష్ నగర్ లో జరిగిన ప్రతి అభివృద్ధి పనిలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉందన్నారు. ఇంటింటి పాదయాత్రలో ప్రజలు పింఛన్లు, నిరుద్యోగ భృతి గురించి అడుగుతున్నారనీ, వీటన్నింటికి ఒకటే పరిష్కారం కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్ర మంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఐఎన్టీయూ సీ అధ్యక్షులు గూడ ఐలయ్య, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యద ర్శి పుష్పారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి.నాగి రెడ్డి, సీనియర్ నాయకులు కొన్నింటి శామ్యూల్, నల్లోల రాజేందర్, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న కుమార్, బాలాపీర్, నవాబ్, షాజీదా బేగం, రియాజ్, మజీద్, హేమంత్, ముఖేందర్, మహేందర్, శేఖర్ గజానంద్, జల్ల శివ, భరత్, క్రిష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
ఐదో రోజుకు హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర
కుత్బుల్లాపూర్ : మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కొలన్ హాన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా సుభాష్ నగర్ 130 డివిజన్, గంపల బస్తీ, రాంరెడ్డి నగర్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి కోలన్ హాన్మంత్ రెడ్డి. గడప గడపకు హాత్ సే హాత్ జోడో అభియాన్ స్టికర్ వేసి, కరపత్రాలను పంచుతూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల ధ్వంద్వ నీతిని, అధికారం కోసం మోసపూరిత హామీలతో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి వివరించి, కాంగ్రెస్ ప్రజలకు కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ హయంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్ర మంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్, ఆలిండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజే జేమ్స్, సోమ్మన గారి శ్రీధర్ రెడ్డి, సంఘం వీరేష్ గుప్తా, గురువారెడ్డి, రామ్ చందర్, హేమ రాణి, సుల్తానా బేగం, పండరి రావు పాల్గొన్నారు.