Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గాజులరామారం డివిజన్లోని సుభాష్ చంద్రబోస్ నగర్, కుత్బుల్లాపూర్ డివిజన్లోని ద్వారకా నగర్లలో శక్తి కేంద్రాల వారీగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ పాల్గొని మాట్లాడారు. మహిళలను వడ్డీ లేని రుణాల పేరిట, యువతను నిరుద్యోగ బృతి పేరిట మోసం చేసిందన్నారు. అధిక కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. శక్తి కేంద్రాలు, బూత్ల వారీగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని బీజేపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, రాజేశ్వరరావు, నాయకులు వెంకట రాజ్ గౌడ్, గడ్డం రాజేందర్రెడ్డి, రాజేష్, మిశ్రా, కృష్ణ యాదవ్, దయాకర్, అలివేలు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు బలరాం, బూత్ అధ్యక్షులు, బూత్ నాయకులు, పన్నా ప్రముఖులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.