Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద ఎక్కువగా ఉందని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఎంటమాలజ సిబ్బందితో కలిసి ఎల్లమ్మచెరువులో డ్రోన్ యంత్రం సాయంతో దోమల నివారణ మందులను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తి తగ్గుతు ందన్నారు. ప్రజలందరూ తమ ఇండ్లతోపాటు పరిసరా లను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాలనీ పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. చెత్తను నాలాలు, చెరువుల్లో వేయకుండా తడి, పొడి చెత్తను వేరువేరుగా చేసి బస్తీకి వచ్చే చెత్త సేకరణ ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకట్ నాయక్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, సుబ్బారావు, ఎంటమా లజీ ఏఈ ఉషారాణి, సూపర్వైజర్ డి.నరసింహులు, ఎంటమాలజీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.