Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లిహిల్స్
బోరబండ బాలికల గురుకుల పాఠశాలలో జనవిజ్ఞానవేదిక, జూబ్లీహిల్స్ కమిటీ ఆధ్వర్యంలో విద్యా ర్థినులతో ''శాస్త్రీయ దృక్పథం'' అనే అంశంపై సభ నిర్వహి ంచారు. ఈ కార్యక్రమానికి జేవీవీ హైదరాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక జూబ్లీ హిల్స్ కమిటీ విద్యార్థుల కోసం నిరంతరం మంచి కార్యక్రమాలు చేస్తు న్నారని తెలిపారు. ముఖ్య ఉపన్యాసకులు శ్రీ కాంతారావు శాస్త్రం, శాస్త్రీయ దక్పథం ఒకటి కాదనీ, శాస్త్రీయ దృక్పథా నికి ఆధారం మాత్రం శాస్త్రమే అనీ, శాస్త్రీయ దృక్పథం ఉన్న వారందరూ ప్రకృతి గురించిన, సమాజాన్ని గురిం చిన నియమాలను అవగాహన చేసుకోవడం, వాటికి సంబంధించిన వాస్తవాలను అనుభవాల ద్వారాను తెలు సుకోవడం అన్నారు. శాస్త్రీయ దృక్పథం ఉన్న వారెపుడూ తమను, తమ భావాల్ని నిరంతరం మార్చుకోవడానికి ఇష్టపడతారని చెప్పారు. వాస్తవం అంటే నిజం కాబట్టి, సమాధానం కాబట్టి ప్రశ్నే సమాధానాన్ని రాబడుతుంనీ, అర్థం బోధపడని ప్రతిఘటనకు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తుంటారని తెలిపారు. ఎందుకిలా, ఎప్పుడిలా, ఎవరలా, ఎక్కడిలా, ఏ విధంగా అలా, ఏమిటిలా అంటూ ప్రశ్నల్ని అనునిత్యం ప్రశ్నించుకుంటూ శాస్త్రీయ దృక్పద ంనే కొలమానంగా తీసుకుంటారని తెలిపారు. అనంతరం చెకుముకి టాలెంట్ టెస్ట్ 22-23లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.