Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్నింగ్ వాక్‌లో కార్పొరేటర్ కొత్త కాపు అరుణా రవీందర్ రెడ్డి
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని ఏ5 ఫంక్షన్ హాల్ కాలనీలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోర్ సూపర్ మార్కెట్ కాలనీ మొత్తం తిరుగుతూ సీసీ రోడ్డు పరిశీలిస్తూ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కాలనీలతోపాటు బస్తీలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాలనీల్లో వేగంగా అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. ప్రజలంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కాలనీవాసులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సన్‌షైన్ ప్రెసిడెంట్ అజీజ్ పాషా, అహ్మద్, ఇస్మాయిల్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.