Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పల శ్రీనివాస్ గుప్తా
నవతెలంగాణ-నాగోల్
రాజస్థాన్, ఉదయపూర్‌లోని తన మిత్రుడి ఫామ్ హౌస్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, ఎంపీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు సోమవారం వారి (పెళ్లిరోజు) 26వ వివాహా వార్షికోత్సవం సందర్భం గా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ మరియు ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్గుప్తవారి సతీమణి స్వప్నతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టూరిజం చైర్మెన్ మాట్లాడుతూ తమ వివాహా వార్షికోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటేందుకు తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టారు. అలాగే 'తెలంగాణకు హరిత హరం' కార్యక్రమంతో కూడా సీఎం కేసీఆర్ ఒక పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని కొన్ని కోట్ల మొక్కలు నాటించి, ప్రతి సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమం తుచ తప్పకుండా అమలు పరుస్తు న్నారని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్ర మంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి వాటిని సంర క్షించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడం పట్ల ఎంపీ సంతోష్‌కుమార్ కృషిని అభినందిస్తూ..అందుకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.