Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్/మల్కాజిగిరి
సఫిల్‌గూడ చౌరస్తా వద్ద అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని సీఐటీయూ మల్కాజిగిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు డిమాండ్ చేశారు. సఫిల్ గూడా చౌరస్తా నుంచి ఆనంద్ బాగ్ చౌరస్తా వరకు ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఫుట్ పాత్‌ను పూర్తిగా ఆక్ర మించి, గ్రీనరీ, సుందరీకరణ పేరుతో అక్రమ నిర్మాణాలు చేస్తున్న జైన్ బాలాజీ కమర్షియల్ కన్స్ట్రక్షన్ సంస్థ పై శాఖపరమైన, చట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రెండుసార్లు జైన్ బాలాజీ కమర్షియల్ కన్స్ ట్రక్షన్ (బిగ్ టౌన్స్) అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించినట్టు చెప్పారు. అయినా అధికా రుల్లో స్పందన లేకపోవడం సరికాదన్నారు. అక్రమ నిర్మా ణాలు చేస్తున్న జైన్ బాలాజీ బిగ్ టౌన్ షిప్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజా సౌకర్యార్థం నిరంతరం రద్దీగా ఉండే ప్రధాన కూడలి సఫిల్ గూడ చౌరస్తా నుంచి ఆనంద్ బాగ్ చౌరస్తా వరకు ఉన్న ఫుట్ పాత్ ను ఆక్రమించి గ్రీనరీ, సుందరీ కరణ పేరుతో అక్రమ నిర్మాణాలు చేస్తున్న సంస్థకు అధికారులు వత్తాసు పలుకు తున్నారంటేనే అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా దీనిపై సంబంధిత జోనల్ కమిషనర్, మున్సి పల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలనీ, ప్రజా సౌకర్యార్థం ఫుట్ పాత్‌ను యధావిధిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. ఈ నిర్మాణం వల్ల ఏండ్లుగా ఉన్న ఆటో ట్రాలీ స్టాండ్ స్థలం కుదించుకపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందనీ, వారాంతపు సంత వల్ల రద్దీ పెరుగుతుం దనీ, సఫిల్‌గూడ (మినీ ట్యాంక్ బండ్) పార్కు సందర్శనకు వెళ్ళే పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంద న్నారు. ఈ విషయమై మల్కాజిగిరి డిప్యూ టీ కమిషనర్ రాజును వివరణ కోరగా..పింక్ ఏరియా జోనల్ పరిధిలో ఉంటుందనీ, జోనల్ వాళ్ళు చూస్తారు అని తెలిపారు.