Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఘట్కేసర్
ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ గ్రామపంచా యతీ కాకతీయ నగర్ కాలనీ సర్వేనెంబర్ 762లో కొంత మంది నిర్మాణదారులు హెచ్ఎండీఏ నియమ నిబంధన లను తుంగలో తొక్కి అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తు న్నారని కావున నిర్మాణాన్ని సరైన మార్గంలో నిర్మించాలని కాలనీ వాసులు కోరారు. మంగళవారం వారు మాట్లా డుతూ.. ఈ ఏసీఈ అపార్ట్మెంట్ నిర్మాణం వల్ల కాలనీ లోనే దాదాపు 20 ఇండ్ల వరకు నష్టం జరుగుతుందన్నారు. అపార ్్టమెంట్ను తమ ఇండ్లకు ఆనుకొని నిర్మిస్తున్నారని దీనివల్ల తమకు గాలి కూడా అందకుండా సమస్య ఏర్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా అండర్ గ్రౌండ్లో నిర్మించాల్సిన సెప్టిక్ ట్యాంక్, వాటర్ ట్యాంక్‌ను తమ ఇండ్లకు ఆనుకొని నిర్మిస్తున్నారని చెప్పారు. వెంటనే ఆ నిర్మాణాన్ని నిలిపి నాలుగు మీటర్ల దూరంలో సెట్ బాక్ అయ్యి నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ఈ సమస్యపై గ్రామపంచాయతీ కార్యాలయంలోని డీపీఓకు, కలెక్టర్‌కు హెచ్ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు సమస్యను పరిష్కరించలేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి తమ ఇండ్లకు రక్షణ కల్పించాలని కోరారు.
దీనిపై చౌదరిగుడా కార్యదర్శి గౌతమి మాట్లాడుతూ.. ఈ సమస్యను ఎంపీఓ పరిశీలన జరిపారని, డీపీఓకు నివేదికను పంపించారని తెలిపారు. అయితే అపార్ట్మెంట్ నిర్మిస్తున్న యజమానులు కోర్టును ఆశ్రయించారని కోర్టు తీర్పు మేరకు సమస్యను పరిష్కరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.