Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ఓయూలో ఓయూ ప్రధాన కార్యదర్శి మిథున్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ దేశ చిత్రపటంలో లేని రాష్టానికి ఊపిరి పోసి అభివృద్ధిలో రాష్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన మహనీ యుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని సాధించిన ధీరోదాతుడు మాన్య ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి దేశం అభివృద్ధి కోసం కంకణ బద్ధులైతున్నారని తెలిపారు. దేశం కూడా వారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటుందని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థుల తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుంద ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్టార్ ప్రొ.పి.లక్ష్మీనారాయణ, టీిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లె ప్రవీణ్ రెడ్డి, వలమల కృష్ణ బండారు, బండారు వీరబాబు, ఓయు పాలక మండలి సభ్యులు పెర్క శ్యామ్, పడాల సతీష్, వెంకట్ గౌడ్, కర్ణాకర్రెడ్డి, అవినాష్ జంగం, కృష్ణ, మెక్కల రవి, శ్రీకాంత్, రాజు, జిల్లా నాగయ్య, రవి, జంగన్న, శ్యామ్ సుందర్, నరేష్, అవినాష్, శ్రీకాంత్, అనిల్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.