Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ పీహెచ్డీ అడ్మిషన్ ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరిగిందనీ, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయ్యాలని ఓయూ పీహెచ్డీ అభ్యర్థులు గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అన్ని యూనివర్సిటీలకు భిన్నంగా పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యా ర్థులకు 45శాతం క్వాలిఫై మార్క్స్ పెట్టి ర్యాంక్స్ ప్రకటిం చడం సరైన పద్ధతి కాదన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ను వైలేషన్ చేస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాసిన వారందరూ అర్హులు, బీసీ విద్యార్థులకు 20శాతం అర్హత శాతం, ఓసీ విద్యార్థులకు 25శాతం అర్హత శాతం పెట్టాలని కోరారు. పరిశోదన విలువలు పాటించకుండా పరిశోదనా మెథడాలజీ ప్రశ్నలు లేకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులకు ఒకే రిజర్వేషన్ పద్దతి పెట్టి బలహీన వర్గాలను ఉన్నత విద్య ను దూరం చేసే కుట్ర చేస్తున్న ఓయూ వీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీసీ అనాలోచిత నిర్ణయాల వల్ల పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించింది కేవలం 20శాతం మాత్రమే అన్నారు. ఓయూలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి 45శాతం ఓసీ వారికి 50శాతం అర్హత శాతం ఈ విధంగా ఉండటం మూలాన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులమైన తాము ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. అర్హత శాతాన్ని ఇతర యూనివర్సిటీల వలే ప్రకటించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.