Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ప్రముఖ మొబైల్ కంపెనీ ఐటెల్ తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్లు ఐటెల్ సంస్థ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. రికార్డు స్ధాయి రిపీట్ కస్టమర్లతో కళకళలాడుతున్న మొబైల్ కంపెనీ ఐటెల్ కేవలం రూ.8 వేలకే సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకు వచ్చిన ఐటెల్ తమ మార్కెట్‌ను మరింత పెంచుకు నేందుకు నడుం బిగించింది. ఐటెల్ మొబైల్్ ఇండియాతో తమ అనుబంధం గురించి, భారతీయ వినియోగదారుల ఆకాంక్షలు, అవసరాలకు తోడ్పడుతున్న ఐటెల్ మొబైల్ మిషన్‌ను హృతిక్ రోషన్ అభినందించారు. ఆధునాతన మైన, నూతన తరపు, సరసమైన స్మార్ట్ఫోన్లతోఐటెల్ మొబైల్ మెరుగైన జీవితాన్ని గడపటానికి తోడ్పడుతుంద న్నారు. ఐటెల్‌తో డిజిటల్‌గా ప్రగతిశీల, సాధికారిత కలిగిన భారతదేశపు దిశగా నడిపించే అద్భుత ప్రయా ణంలో భాగం కావడానికి ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నారు.