Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ అభివృద్ధి ప్రదాతగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించు కుని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పులిమామిడి నారాయణ ఆధ్వర్యంలో రూపొం దించిన పోస్టర్ణు గురువారం ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కాలాలపాటు రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆకాంక్షించారు. కార్మిక ఉద్యోగ జీతాలు వారి ప్రయోజ నాలు పెంచడంలో దేశంలో అగ్రభాగాలు నిలిచిన నేత కేసిఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియ న్ జనరల్ సెక్రెటరీ కిరణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారత్నం, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, విజరు కుమార్, మారుతి ప్రసాద్, వీరేశం పాల్గొన్నారు.