Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట/ కుత్బుల్లాపూర్
అసెంబ్లీ సమావేశాల్లో దివ్యాంగుల సమస్యలు లేవనెత్తి ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కషి చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల పక్షపాతి అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే 3 వేలకు పైగా పెన్షన్ అందజేస్తూ అందరికీ అండగా ఉంటున్నారని గుర్తు చేశారు. ఈ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమానికి తన వంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం సభ్యులు బీసు వెంకటేష్ గౌడ్, శ్రావణ్ కుమార్, ఏసు బాబు, బ్రమరాంబ, మంజుల, రమ, సమీర్ తదితరులు పాల్గొన్నారు .