Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాస గృహాల మధ్యే తిను బండారాలు, పిండి వంటల తయారీ
- పోగ, ఘాటైన వాసనలతో ఇబ్బంది పడుతున్న స్థానికులు
- ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని ఆవేదన
నవతెలంగాణ-కేపీహెచ్బీ
మనిషి మానవత్వపు విలువలు తుంగలో తోక్కి ముందుకు సాగుతున్న రోజులివి. తమ వల్ల ఎదుటి వారికి హనీ కలుగుతుం దని తెలిసి కూడా కొందరు డబ్బు సంపాదనకే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ వల్ల సాటి మనుషులు రోగాల భారీన పడుతున్న వ్యాపారస్తులు పట్టించుకునే పరిస్థతి కనిపించడం లేదు. తినుబండారాల తయారి కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల స్థానిక ప్రజలు నిత్యం పోగ, ఘాటైన వాసనలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వద్దులు, చిన్నారులు సైతం అస్తమా, శ్వాస కోశ వ్యాధులతో భాధపడుతున్నారు. స్థానికులను అనారోగ్యానికి గురి చేస్తున్న తినుబండారాల తయారి కేంద్రంపై ''నవ తెలంగాణ '' ప్రత్యేక కథనం.
వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్లోని నాగార్జున విద్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ తిను బండారాల తయారీ కేంద్రం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. నిత్యం ఘాటైన వాసనలు, దట్టమైన పోగవల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ తినుబండారాల తయారీ కేంద్రాన్ని నివాస గహాల మధ్య నుంచి తరలించాలని సంబంధిత అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. నిర్వహకులను స్థానిక నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాటరింగ్ కేంద్రం నుంచి వెలువడే ఘాటైన వాసనల వల్ల , పోగ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిర్వహకులను ప్రశ్నిస్తే స్థానికులపై దాడులు చేస్తున్నారని వాపోయారు. ఎన్నో సార్లు పోలీసులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులకు స్థానిక నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రెండు సార్లు అగ్ని ప్రమాదం ...
క్యాటరింగ్ కేంద్రంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడంతో గతంలో రెండు సార్లు భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఎప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదుర్కోనవలసి వస్తుందోనని బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఉన్నతాధికారులు, తినుబండారాల తయారు కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించడంతో పాటు నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో స్థానికులందరూ కలిసి ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేయడంతో పాటు పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ మొద్దు నిద్ర వీడి చర్యలు తీసుకుంటారో .. లేదో వేచి చూడాలి ... మరి..!