Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్, గాజుల రామారం జంట సర్కిళ్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లోని శివాలయాలు రెండు రోజులుగా విద్యుత్ దీపా లతో అలంకరించారు. జగద్గిరి గుట్ట, రంగారెడ్డి నగర్, చింతల్, గాజులరామారం, కుత్బుల్లాపూర్, డివిజన్లో పలు ప్రాంతాలలో శివాల యాలు ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరించారు. జగద్గిరిగుట్ట డివిజన్ అంజయ్య నగర్లోని శ్రీ భ్రమరాంబ మల్లి కార్జున శివాలయం మిరుమెట్లు గొలిపే విద్యుత్ దీపాల మధ్య సర్వాంగ సుందరంగా ఆలయ కమిటీ చైర్మెన్ నల్లగోపుల బాబుగౌడ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ముస్తాబు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించారు.