Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లు ఫూర్తి
- ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మెన్ రాజలింగం
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాతబస్తీ, ఛత్రినాక శివగంగానగర్లో ఉన్న 300 ఏండ్ల లింగాకారంలో ఉన్న అతి పురాతన శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేశామనీ, ఈ మేరకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశామని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాచునూరి రాజలింగం, పాలక మండలి సభ్యులు ఏం.మహేష్, గిట్టి రమేష్, కె.స్వరూప నాయక్, ఏ.శీకాంత్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పి.రమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి జి.మహేందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆలయాన్ని ప్రత్యేక పులా అలంకరణలు, స్వాగత తోరణాలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించామనీ, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేకాలను నిర్వహిస్తున్నామనీ, మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తుల మనోభావాలకు తగిన రీతిలో ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. అత్యంత భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు పరిసర ప్రాంతాలకు చెందిన శివభక్తులతో పాటు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. నేడు ప్రాత కాలమున 3.30 నిమిషములకు సుప్రభాత సేవ, దీపారాధన, గణపతి పూజతో ఉత్సవాన్ని ప్రారంభిస్తారనీ, ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు అభిషేకములు, అర్చనలు నిర్వహింపబడు తాయనీ, సాయంత్రం 7 గంటలకు శ్రీశ్రీశ్రీ ఉమామ హేశ్వరి సహిత లక్ష్మణేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంద నీ, రాత్రి 8 గంటలకు మహిళామణుల మంగళహారతుల తో వైభవంగా పల్లకి సేవ జరుగుతుందనీ, రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ జరుగుతుందని తెలిపారు. 19వ తేదీన ప్రాత్ణ కాల సేవలు తదుపరి మంగళహారతి, తీర్థప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఎస్.వి. శ్రీకాంత్ ఆచార్యులు, అర్చకులు రంజీ పాండేలు తెలిపారు.