Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు కె. కృష్ణదేవ్ రావ్
- జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ రాంపల్లిలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
విద్యార్థులు చదువుతో పాటు విలువలు, సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవాలని జూబ్లీహిల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ కె. కృష్ణదేవ్ రావ్ అన్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ రాంపల్లిలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ కె. కష్ణదేవ్ రావ్ , జూబ్లీహిల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ,జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ రాంపల్లి శాఖ చైర్మెన్ టి. హరిశ్చంద్ర ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రసన్న లక్ష్మి స్వాగతోపన్యాసం చేస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణదేవ్ రావ్‌ను సభకు పరిచయం చేశారు. 2016 లో ప్రారంభమైన ఈ పాఠశాలలో క్యాంటీన్, ఆర్గానిక్ ఫామ్, సి.సి టివి, విశాలమైన క్రీడా ప్రాంగణం ,మినరల్ వాటర్ సదుపాయాలున్నాయని తెలిపారు. అదే విధంగా అనతి కాలంలో పాఠశాలకు లభించిన పురస్కారాలను, పాఠశాల సాధించిన ఘనతను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. చదువుతో పాటు విద్యార్థులకు విలువలు, సంస్కతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభివద్ధికి కషి చేస్తున్నందుకు అభినందిస్తూ, ప్రతీ తరగతి విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొని వికాసాభివద్ధి చెందాలనే ఉద్దేశంతో పేరెంట్ డే వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే విద్యార్థుల ప్రగతి పథంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ముఖ్యమని పేర్కొ న్నారు. విద్యార్థులు కూడా బాగా చదివి సమా జంలో వృద్ధి చెందాలని సూచించారు. జూబ్లీ హిల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ కృష్ణదేవ్ రావ్ మాట్లాడుతూ విద్యార్ధులకు అన్ని సదుపాయాలను కల్పించే వనరుగా ఉండాలని, విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న అంశాన్ని ఎంచుకుని దానిలో ప్రగతిని సాధించాలని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు విద్యార్థులకు వివిధ అంశాల పట్ల అవగాహనను ఏర్పరచాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.