Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాసగుప్త
నవతెలంగాణ-నాగోల్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాలు అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ మరియు ఐవిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియం కోకో గ్రౌండ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఐశ్వర్య విశ్వవిద్యాలయం దిల్సుఖ్నగర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమరనాథుని మంచు లింగ దివ్యదర్శనం ఆదివారం ఆయన సందర్శించి దర్శించుకున్నారు. అదేవిధం గా లేజర్ షో యోగాను భూతి, సైన్స్ మరియు ఆధ్యాత్మిక స్టాలుతో పాటు తదితర కార్యక్రమాలలో పాల్గొని తిలకిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయని అన్నారు. దీంతో దేవాల యాల్లో పనిచేసే బ్రాహ్మణలకు పూజారులకు అపూర్వమైన గౌరవం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని పేద బ్రాహ్మలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతను కలిగిస్తూ ఆదుకుంటుందని పేర్కొన్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్యదర్శన కార్యక్రమం అద్భుతమని నేటి తరానికి ఎంతో ఉపయోగపడే విధంగా నిర్వాహకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారని ఆయన ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విట్టల్ రెడ్డి, బీ.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.