Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లార్డ్స్ స్కూల్స్ చైర్మెన్ సిద్దాల బీరప్ప
నవతెలంగాణ-తుర్కయంజాల్
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లార్డ్స్ స్కూల్స్ చైర్మెన్ సిద్ధాల వీరప్ప వైస్ చైర్మెన్ బెర్లు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కయంజాల్ లార్డ్స్ పాఠశాలలో ఆయత్ స్మార్ట్ లెర్నింగ్ ఆధ్వర్యంలో చేతిరాత పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రోపీలతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదువుతూ అనుకున్న లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు లార్డ్స్ విద్యాసంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. అనంతరం లార్డ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు చేతిరాత పోటీలను నిర్వహించినట్టు చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.