Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ చింతపంటి ప్రవీణ్
నవతెలంగాణ - సరూర్‌నగర్
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు లాంటి అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ చింతపంటి ప్రవీణ్, సైంటిస్ట్ డాక్టర్ శ్రీధర్‌లు అన్నారు. భాష్యం లిటిల్ చాంప్స్ 10వ వార్షికోత్సవ వేడుకలు పల్లవి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా వారితో పాటు భాష్యం విద్యాసంస్థల సీఈవో చైతన్య, జెడి ఓ అంకమ్మరావులు హాజరై కార్యక్రమంలో జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ప్రణాళికలు తీర్చిదిద్దే విధంగా భాష్యం విద్యా సంస్థలు చూపే కృషి , శ్రద్ధ ప్రశంసనీయంగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు పాఠశాల దశ ఎంతో కీలకమని, ఈ దశలోనే భవిష్యత్తు కావలసిన పునాదులు వేసుకోవాలి అని అన్నారు. ఈ వేడుకల్లో లిటిల్ చాంప్స్ విద్యార్థులు వివిధ వేషధారణలో ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపాల్ పల్లవి, లిటిల్ చాంప్స్ ప్రిన్సిపాల్ భానుమతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.