Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు కొండంత భరో సా ఇస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద డివిజన్ కు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. పేదలకు కష్టకాలం వచ్చిందంటే దిక్కుతోచని స్థితిలో తీవ్ర అయోమయానికి గురి అవుతారని తెలిపారు. అలాంటి పరిస్థితుల నుంచి పేదలకు కొండంత భరోసానిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందన్నారు. ఆరోగ్యపరంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహ, డివిజన్ అధ్యక్షులు రాకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పోతుల శ్రీకాంత్, మచ్చకుర్తి ప్రభాకర్, ఎర్ర శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.