Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సీఎం సహాయ నిధి పథకం హాపన్న హాస్తంగా మారిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీకి చెందిన బి.ప్రవీణ్ కుమార్ తండ్రి సైదులు తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కొరకు ఆర్థిక స్థోమత లేక కౌన్సిలర్ కే.లక్ష్మీనారాయణని సంప్రదించగా, ఆయన మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నుండి ముందస్తు చికిత్స నిమిత్తం ఎల్ఓసి రూ.2లక్షల 50వేల రూపాయలు మంజూరు చేయించి మంత్రి ఆ చెక్కును బాధితుడు తల్లికి అందచేశారు. అనంతరం చెక్కును స్వీకరించిన బాధితుని కుటుంబ సభ్యులు స్థానిక కౌన్సిలర్ కే.లక్ష్మీనారాయణతో కలిసి మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ పల్లపు శంకర్, జల్ పల్లి మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నం రాజేష్, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.