Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
కాలనీ ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన పార్క్ స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుతూ కాలనీకి చెందిన దివ్యాంగులు ధర్నాకు దిగిన సంఘటన మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లి 15వ డివిజన్ క్రాంతి కాలనీలో సుమారు యాభైై గజాల పార్క్ స్థలాన్ని కొంత మంది కబ్జాదారులు ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టారు. దీంతో కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేయగా గతంలో కూల్చివేశారు. మరలా మంగళవారంనాడు తిరిగి నిర్మాణం చేపట్టారు. దీంతో కాలనీలో నివాసం ఉంటున్న దివ్యాంగులు సదరు స్థలం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే పార్క్ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించక పోవడం వెనుక ఎమైనా రాజకీయ వత్తిడిలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో దివ్యాంగులు వెంకటరమణ, బుచ్చయ్య, యాదగిరి, శ్రీహరి, పిచ్చిరెడ్డిలు ధర్నాలో పాల్గొనగా దివ్యాంగులకు మద్ధతుగా వివిధ ప్రజా సంఘాల నాయకులు శేషగిరిరావు, సంతోష్, పంగ ప్రణరు, మనోజ్, పంగా రాజు, బాగ్యమ్మ, మంగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.