Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా తక్షణమే ఇంజనీరింగ్ విద్యార్ధుల ఫీజులు కట్టించుకోవాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్ చేశారు. జేఎన్టీయూహెచ్ పరిధిలో విద్యార్థులు పరీక్షల ఫీజులు కళాశాల బకాయిలతో సంబంధం లేకుండా ఫీజులు కట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజారి హుస్సేన్‌కు మంగళవారం వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మేడ్చల్ జిల్లా కార్యదర్శి సంతోష్ రాథోడ్‌లు మాట్లాడుతూ జెఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఫీజు యూనివర్సిటీకి 40 కళాశాలలు పెండింగ్ ఉన్నాయనే పేరుతో ఆయా కళాశాలల విద్యార్ధుల పరీక్ష ఫీజులు కట్టించుకోవడం లేదన్నారు. బకాయిలు పేరుతో విద్యార్ధుల ఫీజులు ఆపడం సమంజసం కాదన్నారు. లక్షల రూపాయలు ఫీజులు పెండింగ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఉంచి ఇప్పుడు ఒకేసారి ఫీజులు చెలిస్తేనే పరీక్ష ఫీజులు కట్టిస్తామని అనడం పేద విద్యార్ధుల చదువులకు నష్టం చేయడమే అన్నారు. తక్షణమే ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్ధుల ఫీజులు కట్టించుకోవాలని డిమాండ్ చేశారు. వి.సి. తో మాట్లడి సమస్య పరిష్కారిస్తామని రిజిస్ట్రార్ హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రాజేష్ చౌహన్, జెఎన్టీయూ హెచ్ నాయకులు ఎం.రవితేజ పాల్గొన్నారు.