Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ యశోద
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
కండ్లను పరిశుభ్రంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇనాం గూడ సర్పంచ్ అంతటి యశోద ఊశయ్య అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అంతటి యశోద ఊశయ్య ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ తో కలిసి వైద్య బందం ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగప డుతుందని,అనేక కుటుంబాలు కంటివెలుగు ద్వారా కంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వైద్యం పొందడం జరిగిందన్నారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రమం తప్పకుండా పౌష్టికాహారం, ఆకుకూరలు తీసుకోవడంతో కండ్లకు మేలుజరుగు తుం దన్నారు. కంటి చూపు లేని జీవితాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుమ్ము ,ధూళి కండ్లలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బింగి దాస్ గౌడ్, ఎంపీటీసీ సీక సాయికుమార్ గౌడ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లింగస్వామి, హెల్త్ సూపర్వైజర్ సాగర్, ఏఎన్ఎంలు ఎస్ భాగ్య, భారతమ్మ , డీఈఓ ప్రవళిక, ఆప్తమాలజిస్టు వైష్ణవి, ఆశా వర్కర్స్ శారద, మాధవి, కవిత, అజ్మత్ బేగం తదితరులు పాల్గొన్నారు.