Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గన్కెజేషన్ (ఇస్రో) హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగా నికి హెల్త్ క్వెస్ట్, పేషెంట్ సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను అభివృద్ధి చేయడంలో సంస్థ అపారమైన సహకారానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ను ప్రదానం చేసింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాల యంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత ప్రభుత్వం, ఇస్రో, అంతరిక్ష శాఖ, చైర్మెన్ కార్యదర్శి, శ్రీ ఎస్.సోమనాథ్ అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ ఎమర్జెన్సీ మెడిసిన్ హెడ్, సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడి సిన్ ఇండియా, ఎమర్జెన్సీ టీమ్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఇమ్రాన్ సుభాన్కు ఈ అవార్డును అందించారు. హెల్త్ క్వెస్ట్ (అంతరిక్ష సాంకేతికత ద్వారా ఆరోగ్య నాణ్యతను మెరుగుపరచడం) అనేది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకార ప్రాజెక్ట్. అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఎహెచ్‌పిఐ), సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (ఎస్ఇఎమ్ఐ) ఈ జీరో ఎర్రర్ ఎమర్జెన్సీ మెడి సిన్ ప్రోటోకాల్‌లు, దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్‌లోని అత్యవసర విభాగాలకు ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజ ర్లుగా పని చేస్తాయి. అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ నిపుణుల ఇన్పుట్లను అందించడానికి, అలాగే రోగి భద్రతా ప్రమాణాల తుది ప్రమాణాలను అమలు చేయడానికి గుర్తింపు పొందింది.