Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్క రించాలి అని అధికారులకు గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ సూచించారు. అరుంధతి నగర్ బస్తీవాసులు కలుషిత మంచినీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ, మంచినీటి లోప్రెజర్ సమస్య సేవరేజ్ సమస్యతో డ్రయినేజీ ఓవర్ ఫ్లో సమస్య అధికంగా ఉందని కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేయగా.. వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కార్తిక్ రెడ్డి, మేనే జర్ కృష్ణ మోహన్ వారి సిబ్బందితో అరుంధతి నగర్ బస్తీలో పర్యటించారు. సమస్యను అధికారులకు ప్రత్యక్ష ంగా చూపించి స్థానిక బస్తీవాసుల ద్వారా వివరించారు. ప్రజల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి కలుషిత, మంచినీటి సరఫరా సమస్య, లోప్రెజర్ సమస్య, డ్రయినేజీ ఓవర్ ఫ్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయ కులు నవీన్‌కుమార్, ఉమేష్, బస్తీవాసులు పాల్గొన్నారు.