Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
తెలంగాణ ప్రభుత్వ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఎల్బీనగర్లో మంగళవారం పర్యటించారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలో హబ్సి గూడ నుండి మూసి బ్రిడ్జి వరకు, మూసి బ్రిడ్జి నుండి ఎల్బీనగర్ వరకు జరుగుతున్న మోడల్ కరిడార్ పనులను పరిశీలించారు. ఉప్పల్ శిల్పారామం దగ్గర పనులను పరిశీలించారు. మోడల్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్.ఎం.డి.ఏ అధ్వర్యంలో ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద 25 కోట్లుతో నిర్మిస్తున్న స్కై వాక్ పనులను కూడా పరిశీలిం చడం జరిగింది. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలను అందుబాటులోనికి తీసుకు రావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఎస్.పంకజ, చీఫ్ ఇంజనీర్, హెచ్.ఎం.డి.ఏ, బిఎల్ఎన్ రెడ్డి, ఎల్బీనగర్ జోన్ ఎస్.ఈ అశోక్ రెడ్డి, జీ.హెచ్.ఎం.సి ఇంజినీర్లు పాల్గొన్నారు.