Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిలుక ఉపేందర్ రెడ్డి
నవతెలంగాణ- సరూర్నగర్
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అందరి బాధ్యత అని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కే పురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్నగర్కు చెందిన ఓరుగంటి రవి గత కొన్ని రోజులు క్రితం పక్షవాతం వచ్చి, దాని వల్ల కంటికి సంబంధించి అనారోగ్యంతో బాధపడు తున్న విషయం తెలుకున్న ఉపేందర్ రెడ్డి వైద్య ఖర్చుల కోసం రవికి 10వేల రూపాయల ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు. పెద్దవూర సైదులు, కళ్యాణ్, వంగాల శ్రీకాంత్ రెడ్డి, జహంగీర్, అనుదీప్, విజయ్, మాచర్ల వరుణ్, రాంబాబు, శంకర్ పాల్గొన్నారు.