Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పన రంగాల్లో పెట్టుబ డులు పెంచాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మల్కాజిగిరి మండల కార్యాల యం వద్ద నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మల్కాజిగిరి కార్యదర్శి ఎం.కృపాసాగర్ మాట్లాడుతూ ఆహారం, మందులపై జీఎస్టీ రద్దు చేయాలని కోరారు. పేదలకు 5 కిలోల సబ్సిడీ బియ్యంతోపాటు 5 కిలోల ఉచిత బియ్యం ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు పెంచాలనీ, సంపన్నులపై సంపద వారసత్వం పన్ను విధించాలన్నారు. సంపన్నుల పన్ను రాయితీలు ఉపసంహరించుకోవాలనీ, కేంద్ర ప్రభు త్వ స్కీమ్‌లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు .కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు, నిరుద్యోగులకు తీరని నష్టం కలిగించిందని చెప్పా రు. తగినంత బడ్జెటు కేటాయింపులు లేవన్నారు. కేవలం సంపన్నులకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందన్నా రు. ఇది సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బి.నర్సింగ్ రావు, మంగ పాల్గొన్నారు.