Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ-నేరేడ్మెట్/కాప్రా
న్యాయ విజ్ఞాన సదస్సు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో మంగళవారం ఈసీిఐఎల్లోని సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కాలేజీలో మానవ అక్రమ రవాణా గురించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కమ్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శంకర్ శ్రీదేవి అధ్యక్షత వహించి మాట్లాడారు. మానవ అక్రమ రవాణా, మహిళా చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టాల గురించి, ఉచిత న్యాయ సహాయం గురించి వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కోట రామ చంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, కుషాయిగూడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉపేందర్ యాదవ్, 120 మంది విద్యారులు పాల్గొన్నారు.