Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
కాలనీలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే విధంగా నాయకుడు ముందుకు సాగితే ఆ నాయకుడు ప్రజల మనసులో ఎల్లకాలం ఉంటాడని బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. గురువారం వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరిం చుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి చేత కేక్ కట్ చేయిం చి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుత్తా రవీందర్ గౌడ్, నాయిని శ్రీకాంత్ రెడ్డి, నీళ్ల అంజన్ కుమార్ గౌడ్, శ్రీనివాస్, విజరు కుమార్, వెంకటరమణ కాలనీ, న్యూ వెంకటరమణ కాలనీ, నాగార్జున కాలనీ, శక్తి నగర్, ఈస్ట్ హస్తినాపురం, ఎఫ్సీఐ కాలనీ, ఆర్టీసీ కాలనీ, జంగయ్య కాలనీ, ప్రశాంత్ నగర్, అభ్యుదయ నగర్, జహంగీర్ నగర్, మల్లికార్జున్ నగర్ కాలనీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.