Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లిహిల్స్
ప్రతి ఊడాదీ 3వ తేదీన ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటామని అపోలో ఈఎన్టీ డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ''అందరికీ అందుబాటులో చెవి, వినికిడి లోపం వైద్య సంరక్షణ! దాన్ని నిజం చేద్దాం'' చెవిటితనం, వినికిడి లోపాన్ని నివారించడం, ప్రపంచవ్యాప్తంగా చెవి, వినికిడి సంరక్షణపై మరింత అవగాహన పెంచడానికి ప్రతి ఏడాదీ మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవం (వరల్డ్ హియరింగ్ డే)ను నిర్వహిస్తారు. ''ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఫర్ ఆల్ ! లెట్స్ మేక్ ఇట్ ఎ రియాలిటీ'' అనేది ఈ ఏడాది నినాదం. వినికిడి లోపం అనేది నవజాత శిశువు మొదలుకుని వృద్ధుల వరకు ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. అది వ్యక్తమయ్యే ఫ్రీక్వెన్సీ పరంగా వినికిడి లోపానికి దారితీసే సాధారణమైన కారణాలలో మధ్య చెవి వ్యాధులు, అతి పెద్ద శబ్దాలకు గురికావడం, ఇతర వ్యాధులకు ఉపయోగించే మందులు వంటివి ఉంటాయి. తక్కువ కారణాలలో సాధారణ గాయం, పుట్టుకతోనే వచ్చే సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వాహనాల వల్ల వచ్చే అధిక డెసిబెల్ హార్న్‌ల కారణంగా, బహిరంగ ప్రదేశాల్లో ధ్వని కాలుష్యం, కార్యాలయాలు, ఇల్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు (ఇయర్ఫోన్లు లేదా హెడ్ఫోన్లు) వంటి సాధారణ వాయిస్ ప్రాంప్ట్‌లను ఉపయోగించడం వల్ల, 'నిశ్శబ్ద మహమ్మారి' అనే స్వయం ప్రేరేపితంగా వినికిడి నష్టానికి దారితీస్తుంది. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, అధిక ఒత్తిడి వాతావరణం వంటి జీవనశైలి మార్పులు వినికిడి లోపానికి దోహదం చేస్తారు. దీన్ని నివారించవచ్చు.