Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
మహిళలు ఆకాశంలో సగం, అవని లో సగం, అన్నింట సగం. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రత్యేకగా నిర్వహించే పండగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళల సాధికారిక దిశగా నడిపించడం కోసం నిర్వహించే సంబరమే అంత ర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ మహిళా దినోత్సవ వేడు కలు సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. విధిరాతను ఎదిరించి ఆత్మ గౌరవాన్ని ప్రత్యేకంగా నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్ర లో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకుం టున్నారు. అయితే మహిళల స్థితిగతలు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమాన త్వమే మన ప్రగతికి మూలం ఇదే నినాదంతో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహి స్తున్నది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలు తామే తీర్చుకోగలిగే జీవనాధార అవకాశాలు స్వయంగా నిర్మించుకోగలిగి ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఎంటో ప్రపంచానికి తెలియజేస్తు నే ఉన్నారు. వైద్యం ,విద్య ,వ్యాపారాలు ,రాజకీయాలు ,క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్ష, టెక్నాలజీ వంటి పలు రంగాలలో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారిక సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం. రంగం ఏదైనా ఉన్న ఉన్నత శిఖరాలను చేరుకొని పురుష శక్తికి తామేమి తీసిపోమని చాటి చెబుతోంది స్త్రీ శక్తి . తాము కేవలం ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు దీటుగా విజయాలు సాధిస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండగ భారతదేశంలోని మహిళలకు కాస్తంత చేదు అనుభవాలనే మిగిలిస్తుందనే చెప్ప వచ్చు. ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతను సవాలు చేస్తూ సాగి పోతున్న మహిళలపై దారుణ అఘాయిత్యాలకు అంతులేకుండా పోయింది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చిన నిర్విర్యమవుతున్నాయి. ఇందుకు గల కారణాలను గుర్తించి అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అవరోధాలను అధికమిస్తూ అడుగు ముందుకు వేయాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొట్టమొదటిగా కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన వేతనం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15000 మంది మహిళలు ప్రదర్శన చేయగా ఈ మహిళా డిమా ండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించిన్నట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ దినోత్సవం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని 1910లో కొఫెన్ హెగెన్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో కార్లా జెట్కిన్ అనే ఒక మహిళ ప్రతిపాదించగా ఈ సదస్సులో పాల్గొన్న 17 దేశాల నుంచి వచ్చిన 100 మంది మహిళలు కార్లా జెట్కిన్ ప్రతిపాదనను ఏక గ్రీవంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. దాంతో 1911లో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు.1913 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8కి మార్చి ప్రతి సంవత్సరం అదే రోజున నిర్వహిస్తారు. మహిళా దినోత్సవాన్ని పర్పుల్, గ్రీన్ , వైట్ రంగులతో రిప్రజెంట్ చేస్తారు.