Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్ పేట్
బాలాపూర్ లోని చవాన్ హాస్పిటల్ వారు అరుదైన చికిత్స నిర్వహించారు. కడుపులో నుంచి దాదాపు మూడు కేజీల కణితిని తొలగించి మహిళకు ప్రాణం పోశారు చవాన్ హాస్పిటల్ సిబ్బంది. క్యాన్సర్ వేస్తే భయపడాల్సిన అవసరం లేదదని డా.ఉదరు చౌహాన్ ఈ సందర్భంగా తెలిపారు. కడుపు ఉబ్బి, నొప్పితో బాధపడుతున్న 46 సంవత్సరాల జ్యోతిబారు అనే మహిళకు బాలాపూర్ చావాన్ ఆస్పత్రి డాక్టర్ ఉదరు చౌహన్, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ శంకర్ ఆనంద్ వారి బందం ఎంతో శ్రమించి అరుదైన శస్త్ర చికిత్స చేసి మహిళ కడుపులో నుండి దాదాపు మూడు కేజీల కణితిని తొలగించి మహిళకు ప్రాణం పోశారు. మంగళ వారం డాక్టర్ ఉదరు చౌహాన్ మాట్లాడుతూ జ్యోతిబారు లాంటి రోగులు ఎలాంటి భయాందోళన గురికాకుండా తమ ఆస్పత్రిని సందర్శించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్తారని తెలిపారు. ఆస్పత్రిలో క్యాన్సర్కు సంబంధించి ప్రత్యేకంగా వైద్య బందం ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది క్యాన్సర్ రోగులు తమ ఆస్పత్రికి వచ్చి పూర్తి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. బాలాపూర్ చవాన్ ఆస్పత్రిలో 24 గంటల ఎమర్జెన్సీ సర్వీసులు, ఐసీయూ, డెంటల్ కేర్, క్యాన్సర్ వంటి రోగులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.