Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరూర్ నగర్ మండల తహసీల్దార్ జయశ్రీ
నవతెలంగాణ-సరూర్నగర్
పట్టుదల ఉంటే ఏ పని అయినా సాధ్యమవుతుందని, మహిళలు స్వతహాగా వారి కాళ్లపై నిలబడి ధైర్యం తెచ్చుకొని జీవితంలో ముందుకు పోవాలని సరూర్ నగర్ మండల తహాసిల్దార్ జయశ్రీ తెలిపారు. మహిళా దినోత్సవ సందర్భంగా నవ తెలంగాణతో జయశ్రీ మాట్లాడుతూ 'నేటి మహిళ అన్ని రంగాల్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గతంతో పోలిస్తే మహిళల్లో చదువుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ఉద్యోగరీత్యా సమాజంలోని ప్రజలకు కుటుంబంలో పిల్లలకు తల్లిగా కూడా అదే స్థాయిలో న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా ను. ప్రజా ప్రతినిధులుగా ఉద్యోగులుగా సమర్థవంతంగా మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. కుటుంబ ఆర్థిక విషయాలను మహిళలు సమర్థవంతంగా మేనేజ్ చేసినంత మరెవరు చేయలేరు. నా వంతు సేవలు, వత్తి ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను' అన్నారు.