Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్ పల్లి మున్సిపల్ లోని శ్రీరాం కాలనీలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సహకారంతో రూ.1కోటి 50లక్షల నిధులతో నూతనంగా వేసిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లుతో ప్రజల కష్టాలు తీరుతాయని 19,20 వార్డుల కౌన్సి లర్లు పల్లపు శంకర్,భాషమ్మలు అన్నారు.మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను వారు పరిశీలించారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఎంతో కషి చేస్తున్నదని తెలిపారు. జల్ పల్లి మున్సిపల్ అభివృద్ధికి మంత్రి కోట్లాది రూపాయల నిధు లు మంజూరు చేయటం జరిగిందన్నారు. గతంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రని మంత్రి ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్లు, డ్రయి నేజీలు, విద్యుత్ దీపాలు, మిషన్ భగీరథ పథకంలో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మారుతి,కాలనీ వాసులు ఉన్నారు.