Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యూ ఢిల్లీ, తెలం గాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఆదేశాల మేరకు 04-03-2023 నుండి 11-03-2023 వరకు అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు శివ శివాని డిగ్రీ కళాశాల, కొంపల్లి లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి శంకర్ శ్రీదేవి అధ్యక్షత వహించి మహిళా చట్టాల గురించి, ఉచిత న్యాయ సహాయము గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు లో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి వివిధ చట్టాల గురించి అవగాహన కలిగించారు. సుమారుగా 600 విద్యారులు పాల్గొన్నారు.