Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం అప్రజాస్వామికమని మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రడ్డి అన్నారు.మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఫ్లైఓవర్ వెంటనే ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేసి బాలాపూర్ పోలీస్ స్టేషన్కు తరలిం చడం ఏమిటని ప్రశ్నించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిగిరింత నర్సింహా రెడ్డిలు పరామర్శించారు.ఈ సంద ర్భంగా మేయర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా అరెస్టులు, దాడులు చేయించి భయ బ్రాంతులకు గురిచేస్తున్నదని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి,నాయకులు చింతపట్ల ప్రవీణ్, వరికుప్పల మహేష్ తదితరులు ఉన్నారు.