Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల
నవతెలంగాణ-సంతోష్‌నగర్
కాలనీవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పేర్కొన్నారు. ఎమ్మెల్యే బలాల అధికారులతో కలిసి మూసా రం బాగ్ డివిజన్ సాయినగర్ కాలనీలో పర్యటించారు. కాలనీలో తిరిగి డ్రయినేజీ, మ్యాన్ హౌల్స్, రోడ్డు, నాలా, సమస్యలు పరిశీలించారు. స్థానిక పోచమ్మ టెంపుల్ కుడి వైపు నుంచి మూసారంబాగ్ నాలావైపు రోడ్డు నిర్మాణం వలన తలెత్తిన సమన్యను ఎమ్మెల్యేకు వివరించారు. టెంపుల్ ఎదురుగా ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డుకు సమాంతరంగా నాలావైవు రోడ్డు నిర్మిస్తే వరదనీరు ఇండ్లలోకి వచ్చి చేరుతుందని ఎమ్మెల్యేకు చెప్పారు. కాలనీ వాసులకు ఎవరికీ ఇబ్బంది తలెత్తకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కొత్త పనులకు ప్రతిపాదనలు తయారు చేసి, వీలైనంతమేరకు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికా రులకు సూచించారు. పర్యటనలో డీఈఈ ప్రదీప్ కుమార్. జలమండలి డీజీఎం షీలారాణి, ఏరియా మేనేజర్ చంద్రు నాయక్, విద్యుత్ శాఖ ఏఈ ప్రీతి, ఎండీ అస్లాం, ఇలీయాస్, బాబా, నరేష్, రజాక్, అమిత్, దౌలతా ఖాన్, పాల్గొన్నారు.