Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ శాంతి
నవతెలంగాణ-నాచారం
స్వరాష్ట్రంలో స్వతహాగా మహిళలు అభివద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు కండవ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయని, రాజకీయాలలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి వంటింటికి పరిమితమైన మహిళలను పాలనా వ్యవస్థలో ప్రథమ స్థాయిలో నిలిపారు. జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నవతెలంగాణతో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రశ్న: రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా...?
శాంతి, కార్పోరేటర్ : మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో షీ టీమ్లు మహిళల రక్షణ కోసం నిఘా నీడలా పనిచేస్తుంది. మహిళల భద్రత కోసం బాధ్యతాయుతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
ప్రశ్న: మహిళలు స్వతహాగా అభివద్ధి చెందారని మీరు భావిస్తున్నారా...?
శాంతి, కార్పోరేటర్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలు స్వతంత్రంగా అన్ని రంగాలలో అభివద్ధి చెందారు. మహిళలకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు మహిళలకు ప్రత్యేక రాయితీలు, అనేక సంక్షేమ పథకాలను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. నేటి మహిళలు తన కుటుంబంతో పాటు సమాజంలో స్త్రీ ఔనిత్యాన్ని చాటుతున్నారు.
ప్రశ్న: పాలనలో మహిళలకు ప్రాధాన్యత, గౌరవం ఉందా..?
శాంతి, కార్పొరేటర్: పాలనలో ప్రత్యేకమైన ప్రాధాన్యతతో పాటు మహిళగా గౌరవం కూడా మెండుగా ఉంది. మహిళా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాగలిగింది. నాలాంటి వాళ్లు ఎందరో కార్పొరేటర్లుగా గెలిచి ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు.
ప్రశ్న: మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటి...?
శాంతి, కార్పొరేటర్: సమాజంలో మహిళలు ఎంచుకున్న రంగాలలో రాణించాలంటే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినప్పుడు విజయం తన సొంతమవుతుంది. ముందుకు వెళుతున్న క్రమంలో అనేక కష్టాలు,ఒత్తిళ్లు ఎదురవుతాయి. వాటన్నింటినీ ఎదిరించి నిలబడితే అంతిమ విజయం నీదవుతుంది.