Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఈద్గా రోడ్డు చాణిక్యపురి కాలనీలోని డ్రయినేజీ పొంగిపొర్లుతున్నది. మల్లాపూర్లో డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని బ్యాంకు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుర్ణం రాజేష్ పేర్కొన్నారు. వాటర్, డ్రయినేజీ వ్యవస్థ ఒకటి కావడంతో నిత్యం డ్రయినేజీ పొంగిపొర్లుతున్నా వాటర్ వర్క్స్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో జిహెచ్ఎంసి సిబ్బంది పర్యవేక్షణలో భూగర్భ డ్రయినేజీ పొంగినా మ్యాన్ హౌల్ మూతలు పగిలిపోయిన, మురుగు పరుగు పెడుతున్న పట్టించుకునేవారు. ప్రస్తుతం మెట్రో వాటర్ వర్క్స్ ఆధీనంలో డ్రయినేజీ మ్యాన్ హౌల్స్ శుభ్రం చేసే పని అప్పగించిన తర్వాత నిత్య కత్యంగా డ్రయినేజీ రోడ్లపై పొంగిపొర్లుతున్న పట్టించుకునే నాధుడే లేడు. రోజుల తరబడి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తున్న కన్నెత్తి కూడా చూడని వాటర్ వర్క్స్ అధికారులు సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మురుగులో నడుచుకుంటూ వెళ్లవలసిన దుస్థితి ఎదురవుతుందని వారు చెబుతున్నారు. అధికారులకు, స్థానిక కార్పొరేటర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పెడచెవున పెడుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలో విఫలం అవుతున్నారని మండిపడ్డారు. మల్లాపూర్లో డ్రయినేజీ సమస్య సర్వసాధారణంగా మారింది. స్థానిక ప్రజలు మురుగులో మరిగిపోతున్నారు. ఏ కాలనీకి వెళ్లిన డ్రయినేజీ మురుగు దర్శనమిస్తుంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి డ్రయినేజీ మురుగు సమస్యను నియంత్రించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.