Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మెన్ బిక్షపతి యాదవ్
నవతెలంగాణ-దుండిగల్
కుతుబుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు కట్టిన పన్నులతో ప్రభుత్వ నిధులచే నిర్మించబడిన వివిధ కాలనీలోని కమ్యూనిటీ హాలులు వ్యక్తిగత ఆదాయాలు సమకూర్చే కేంద్రాలుగా మారి స్థానిక అధికార పార్టీ స్థానిక నాయకులకు తలా కొంత పంచుకుంటు అందులో కొంత మందికి కాసులపంటగా మారిందని లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మెన్ బిక్షపతి యాదవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా నిజాంపేట్ బండారి లేఔట్‌లోని కమ్యూనిటీ హాల్ కాలనీ ప్రజల అవసరానికి పనికొస్తుందని ఉద్దేశంతో ప్రభుత్వ నిధులతో నిర్మించబడిన కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకుల గుప్పెట్లో పెట్టుకొని కార్పొరేషన్‌కి రావలసిన ఆదాయానికి గండి కొడుతున్నారని, గతంలోనే అనేకమార్లు ఇక్కడున్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్థానికులు విన్నవిం చుకున్న ఉలుకు పలుకు లేకుండా ఇక్కడున్న అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలాగే నేటి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఏర్పరచుకునే స్టాల్స్ కొరకు ఒక్కొక్క స్టాల్‌కు దాదాపు 3000 నుండి 5000 వసూలు చేస్తున్నారని, బాహాటంగానే తెలియ వస్తుంది. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తుందని, మరో వైపు స్థానిక పార్కులో జిమ్ పరికరాలు మరమ్మతులు చేపట్టవలసి ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారని, కమ్యూనిటీ హాల్ నిర్మించినప్పటి నుండి ఇప్పటివరకు వసూలైన డబ్బుల పైన లెక్క పత్రం ఏమాత్రం ఏమి లేదని ఎవరైనా ప్రశ్నించి అడిగితే సామాన్లు కొంటున్నామని తెలుపుచూ దబాయిస్తున్నారని, కనీసం కమ్యూనిటీ హాల్ కరెంటు బిల్లు కూడా చెల్లించకుండా వ్యవహరిస్తున్నారని, ప్రజా ప్రయోజనాల కోసం కాలనీలో నిర్మించబడిన కమ్యూనిటీ హాల్ కాలనీ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి కదా, కమ్యూనిటీ హాలు తాళాలు అధికార పార్టీ నాయకుల చేతుల్లో బంధించుకుని ఉంటే, ఇక్కడున్న కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిం చడం స్థానికులకు విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ వచ్చే ఆదాయం గండిపడు తుంటే పై అధికారులు కాపాడి చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు.