Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అలీప్ ఇండిస్టియల్ ఎస్టేట్లో ఈనెల 11న శనివారం అలీప్, టీఎస్ఐఐసీ ఐలా ఆధ్వర్యంలో హోలిస్టిక్ హాస్పిటల్స్ భాగస్వామ్యంతో సీిఈడీి బిల్డింగ్ నందు ఉచిత వైద్య శిబిరం ( హెల్త్ క్యాంప్ ) ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామని, అలీప్ సర్వీస్ సొసైటీ సెక్రెటరీ బి.కవిత రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి మొదటగా వచ్చే 500 మందికి ఉచితంగా మందుల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు కుటుంబ భారం మోస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవట్లేదు అన్నారు. మహిళలు కుటుంబ భారంతో తలమునుకలై ఆరోగ్యంపై తగిన శ్రద్ధ కనబరచకపోవడం వల్ల అనేక రుగ్మతల బారిన పడుతున్నారని, అలాంటి వారి కోసం అలీఫ్లో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని అలీఫ్ ఎంప్లా యిస్తోపాటు పరిసర ప్రాంత ప్రజలు తప్పక ఉపయోగించు కోవాలన్నారు.