Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినరు కుమార్
- స్త్రీ పురుష సమానత్వం పై లఘు చిత్ర ప్రదర్శన
నవతెలంగాణ-హైదరాబాద్
శ్రమలో పుట్టి, శ్రమలో పెరిగి సమైక్య జీవన సౌందర్యంతో బతికే మహిళాభివృద్ధి, పోరాట దినమే మార్చి 8 అని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టిపిఎస్ కే షార్ట్ ఫిలిం గ్రూప్ దాశరది థియేటర్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూడు లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్.వినరు కుమార్ మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వాన్ని అన్ని రంగాల్లో సమభాగస్వామ్యాన్ని కోరుకుంటూ.. తీసిన సిని మాలు మహిళా లోకానికి మకుటాయమానమనీ, అద్భుత సం దేశం అన్నారు. సమాజంలో పాతుకుపోయిన సామాజిక అంతరా లను పాలకులు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన తీరు ప్రశంసనీయమన్నారు. టిపిఎస్కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈరోజు ప్రదర్శించిన '' నేటి మహిళ'' ''పశువు'' ప్రతి చెల్లి ప్రతి అక్క పోలీస్ ఆఫీసర్, ఈ చిత్రాలు మహిళా జీవితాలకు దర్పణం ఇలాంటి లాంటిదనీ, ఈ చిత్రాలను మహిళలోకం ప్రోత్సహించాలని సందేశాత్మక చిత్రాలు సమాజంలో పురుషాధిక్యతను తుడిచివేస్తాయని చెప్పారు. ''వరకట్నంతో.. నీ మెడలో వేసిన తాళి కాదు.. ఆది ఎగతాళి.. నీ నుదుట దిద్దింది తిలకం కాదు.. చిత్రహింసలకు చిహ్నమైన రక్తపు బొట్టు.. నీ కాలికి తొడిగింది మెట్టె కాదు నీ ప్రగతి పై వేటువేసే సమ్మెట'' అన్న డైలాగులు ఎందరినో ఆలోచింపజేశాయన్నారు. షార్ట్ ఫిలిం గ్రూప్ టీం నాయకులు బి డి ఎల్ సత్యనారాయణ '' నేటి మహిళా'' అనే చిత్రంలో నటుడు, నిర్మాత మాట్లాడుతూ మనలో ప్రతి ఒక్కరికీ భద్రత లేనప్పుడు ఎవరికి భద్రత ఉండ దనే.. సత్యాన్ని మనం మర్చిపోకూడదనీ, ప్రజల పట్ల ప్రేమ, మానవతా, సమిష్టితత్వం, రుజువర్తన స్వార్థ రహిత్యం, పని పట్ల శ్రద్ధ, ఇవే నూతన మానవుని లక్షణాలు భవిష్యత్ లక్ష్యంగా లఘు చిత్ర నిర్మాణాలు జరగాలన్నారు. నిస్సారపు, నిర్జీవపు సమాజాన్ని వెనక్కి నడిపే సినిమాలు మనకోద్దనీ, మనిషే కేంద్రంగా..శ్రమే గీటురాయిగా సినిమాలు రావాలనీ, అలాంటి సినిమాలను టిపిఎస్కే, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిరంతరం చిత్ర ప్రదర్శన కేంద్రంగా ఉంటుందని సందేశంతో పాటు హామీనిచ్చారు. చిత్ర దర్శకులు పీ.మోహన్ రామ్ ప్రసాద్, నిర్మాత దుర్గాప్రసాద్ నేటి మహిళా నటీనటులు శ్రీదేవి బీడీఎల్ సత్యనారాయణ నటులు వైవిఆర్ ఆచార్యులు దర్శకుడు రఘు రామచంద్ర రచయిత నిర్మాత విజరు కుమార్ పశువు సినిమా యూనిట్‌కు సంబం ధించిన శరణ్య, స్రవంతి, రామస్వామి మహేష్ బోయ ఉత్తమ నటి: శరణ్యను, స్రవంతిలను దాశరధి థియేటర్ నిర్వహణ కమిటీ ఎస్.వినరు కుమార్ భూపతి వెంకటేశ్వర్లు సత్కరించింది ప్రతి చెల్లి అక్క ఒక పోలీస్ ఆఫీసర్ అనే లఘు చిత్ర నటులు నిర్మాత రాజనాల సత్యం సుజావతి, సుశీల దూది పాల్గొని ఇలాంటి సినిమాలకు అండగా మద్దతుగా ప్రోత్సాకంగా మేము ఉంటామని ప్రకటించారు.