Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-అడిక్‌మెట్
మన సంస్కతి, సాంప్రదాయాలను చాటిచేప్పేవే మన పండుగలు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్ర మల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఇందిరా పార్కు లో నిర్వహించిన హౌలీ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. భారతదేశంలోనే మనం జరుపుకునే పండు గలు ఎంతో గొప్పవన్నారు. ప్రతి పండుగ నిర్వహణకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుందన్నారు. అందులో హౌలీ కూడా ఒకటి అన్నారు. హౌలీ వేడుకలను ప్రతి ఏడాదీ దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకోవడం సంతోషకరం అన్నారు. మనం జరుపుకునే పండుగలు, ఆచారాల గురిం చి నేటి తరం యువతలో చాలా మందికి తెలియదనీ, తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆచారాలు, సాంప్ర దాయాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నా రు. విదేశీ సంస్కతికి ఆకర్షితులై మన సంస్కతులు, ఆచారాలను మరచిపోతున్నారనీ వాటిని పరిరక్షించుకోవా ల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రతినిత్యం వేలాదిమంది వచ్చే నగరంలోనే అతిపెద్ద పార్క్‌గా ఉన్న ఇందిరా పార్క్‌ను ఎంతో అద్బుతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరా బాద్ నగరం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింద న్నారు. పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ యువజన నాయకులు ముఠా జయసింహ, కార్పొరేటర్ రచన శ్రీ, సరస్వతి, ఉపాసకులు దైవజ్ఞ శర్మ, తదితరులు పాల్గొన్నారు.