Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీల పేర్లు కూడా మహిళలవే ఎల్బీనగర్ నియోజకవర్గంలో అన్ని పదవుల్లో మహిళలే
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురంలోని కమలానగర్, భూలక్ష్మీనగర్, సుభద్రనగర్, శారదానగర్, శాంతినగర్, చుట్టుపక్కల గల కాలనీల పేర్లు కూడ మహిళల పేర్లని సూచిస్తున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గం లేక హయత్నగర్ డివిజన్లో గల ముఖ్య ప్రభుత్వ శాఖలను కూడ మహిళలే నిర్వహించడం ఈ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ప్రతిబింబింపచేస్తున్నాయి. జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, హయత్ నగర్ ఎమ్మార్వో, ఏఈ విద్యుత్, జీహెచ్ఎంసీ, ఏఈ విద్యుత్ శాంతినగర్, ఏఈ వాటర్ బోర్డు, ప్రభుత్వ పాఠశాల వనస్థలిపురం. ఇక నిత్యం పారిశుధ్య కార్యక్రమం నిర్వహించే మహిళలు చెప్పనవసరం లేదు. ఇది చాలదా మనం మహిళల పట్ల చూపిన ప్రాధాన్యత అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో. తల్లిగా పాలిచ్చి పెంచినా, పంచినా భార్యగా భారమంత భరించినా, సోదరిగా అన్నదమ్ములను ఆదరించినా కార్యాలయాలలో సన్నిహితులకు సహకారం అందించినా, కూలిపనులలో కష్టపడి శ్రమించినా, ఆకాశ కన్యగా లోహ విహంగంలో సేవలు చేసినా, అంతరిక్షంలో చందమామను చేరినా, చలన చిత్రాలలో తారలుగా తళుకులీనే స్ధాయిలో నటించినా, అంతర్జాలంలోనూ, అణు పరిశోధన కేంద్రంలోనూ వైద్య, విద్య రంగాల్లో శాస్త్ర, సాంకేతిక అభివద్ధి చెందినా, చట్ట సభలలో వేదికలెక్కి చర్చలు చేసినా, న్యాయస్థానాలలో నిలబడి వాదనలు చేసినా, కోఎడ్యుకేషన్ విద్యా సంస్థలలో చదివినా, ఇంకా ఈ సమాజంలో ఎక్కడో ఒకచోట మాత్రం లోపం వుందని పిస్తోంది. అదేమిటో కనిపెట్టాలి అరాచకాలను అరికడితేనే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం అవుతుంది. అతివ లేనిదే అవని లేదు. అమ్మ లేనిదే జన్మే లేదు. క్షమకు నిదర్శనం క్షితి అయితే ఓర్పుకు నిదర్శనం తల్లి మాత్రమే మహిళలను గౌరవించాలి అనేది ఒక సంస్కారం. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమాజంలో మహిళలపై లింగ వివక్షత తొలగించేదిగా వుండాలని పురుషులతో అన్ని రంగాలలో సమానంగా విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా వుండాలనేదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష.