Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం హయత్ నగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎర్ర రవీందర్, పారంద స్వామిలు మాట్లాడుతూ కోడి కూతకు ముందే లేచి గ్రామాలలో ఉన్న చెత్తాచెదారంతో పాటు రోడ్లను గ్రామాల్లో ఉన్న ఉన్నటు వంటి చెడును ముట్ట రానటువంటి వాటిని కూడా ముట్టుకొని తొలగించి గ్రామాలను అద్దంలాగా తయారు చేస్తారు పరిశుధ్య కార్మికులు, ఇప్పటికీ కూడా వాళ్ల శ్రమను గుర్తించకపోవడం చాలా బాధాకరం అన్నారు. సావిత్రిబాయి పూలే అన్నట్టు స్త్రీ వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందుండాలని సావిత్రిబాయి పూలే ఆలోచన ఆశ ఆశయం, వారి కలలను నిజం చేస్తూ పారిశుధ్య పని మొదలుకొని అన్ని రంగాలలో స్త్రీలు ముందుడం చాలా సంతోషకరం. ఇప్పటికైనా ప్రభుత్వం వారి శ్రమను గుర్తించి వారికి కావలసిన సబ్బులు, బూట్లు, బ్లౌజులు, నూనె డబ్బాలను వెంటనే అందించి ఆదుకోగలరని ప్రభుత్వాన్ని కోరారు. వీళ్ళ శ్రమను గుర్తించి ప్రభుత్వం ఒక జీవిత బీమా అంటే 25లక్షల బీమాను వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పారిశుధ్య కార్మికురాలు యాదమ్మ కష్ణమ్మ, భాగ్యలక్ష్మి, స్వప్న, పావని, శ్రావణి, వీరితో పాటు బీసీ సంఘం నాయకులు సుక్క బాబయాదవ్, ఎర్ర గిరిబాబు, ఆదాం పాల్గొన్నారు.