Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డెర వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విగేశ్
నవతెలంగాణ-తుర్కయంజాల్
వడ్డెర వత్తిదారులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు విగేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడలో 774 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో గల నాలుగు ఎకరాల 21 గుంట భూమిలో వడ్డెర వత్తి చేసుకుంటున్న భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం గతంలో పోలీస్ పటేల్ దగ్గర నుండి తీసుకుని వడ్డెర హరిమాల సొసైటీకి రిజిస్ట్రేషన్ నెంబర్ టీబీ 366/88 ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. గత 50 సంవత్సరాల నుండి ఈ భూమిలో వడ్డెర వత్తిని చేసుకుంటూ సుమారు 25 కుటుంబాలు ఈ కార్వీలపై పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, కొంతమంది పెత్తందారులు ఈ భూమిపై కన్ను వేసి ఆక్రమించుకో వాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం, రెవిన్యూ అధికారులు చొరవతీసుకొని ఈ భూమిని సమగ్రంగా సర్వే చేసి చుట్టూ హద్దురాళ్లు నాటి, వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా వడ్డెర వత్తిదారులకు రక్షణ కల్పించాలని కోరారు. కుర్మ సంఘం నాయకులు, కుర్మ యువకులు దౌర్జన్యంగా భౌతిక దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖడించారు. వడ్డెర వృత్తిదారులపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర వత్తిదారుల సంఘం నాయకులు పల్లపు శివకుమార్, పల్లపు ఆంజనేయులు, పల్లపు రంగయ్య, పల్లపు యాదయ్య, బాల్రాజ్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.